2027 మార్చిలో నిర్వహించనున్న SSC, OSSC, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షా ఫీజు చెల్లింపు గడువును డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ పొడిగించింది. విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైబర్ ట్రెజరీ ద్వారా ఆన్లైన్ చెల్లింపులను ఈ నెల 27 వరకు పూర్తి చేయవచ్చు. అదనపు సమయం కోరుకునే వారి కోసం రూ.50 లేట్ ఫీజుతో DEC 8 వరకు, రూ.200 ఫీజుతో DEC 21 వరకు, రూ.500 ఫీజుతో 2027 JAN 4 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.