భూముల విలువ పెంపుతో ఆదాయం జోరు

TG: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు పెంచిన తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఊహించని రీతిలో ఆదాయం సమకూరుతోంది. కొత్త ధరల పెంపు వల్ల సగటున రోజూ దాదాపు రూ. 10 కోట్ల మేర అదనపు ఆదాయం లభిస్తోంది. గతేడాది జూన్ 25 నాటికి రూ. 920 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది జూన్ 25 నాటికి అది రూ. 1,023.42 కోట్లకు చేరింది. ఈ ఒక్క నెలలోనే దాదాపు రూ. 200 కోట్లు అదనంగా ఖజానాకు చేరనున్నాయి. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆదాయంలో మాత్రం ఊహించని వృద్ధి కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్