"స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా పేరుగాంచిన విస్పీ ఖరాడి మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఆగస్టు 17, 2025న పంజాబ్ అట్టారి సరిహద్దులో హెర్క్యులస్ పిల్లర్స్ ఛాలెంజ్‌లో 261 కిలోలు (575.4 పౌండ్లు) బరువును 67 సెకన్లు పట్టుకుని కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఇది అతని 17వ రికార్డు. విజయాన్ని భారత సాయుధ దళాలకు అంకితం చేసిన విస్పీ, మానవ శక్తి పరిమితులను అధిగమిస్తూ స్ఫూర్తినిస్తున్నాడు.