ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న హర్మోజ్ జలసంధి, గతంలో తెలుగు రాజ్యాల చరిత్రలో కీలక పాత్ర పోషించింది. విజయనగర కాలంలో ఇక్కడి నుంచి విదేశీ వాణిజ్యం విస్తరించింది. అరేబియా, పర్షియా నుంచి అశ్వాలు, విలువైన వస్తువులు హురుమంజి రేవు ద్వారా ఆంధ్ర తీరాలకు చేరేవి. శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథుడు తమ రచనల్లో ఈ వాణిజ్య ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. నేడు చమురు రవాణా కేంద్రంగా ఉన్న హర్మోజ్, అప్పట్లో తెలుగు రాజ్యాల సైనిక, ఆర్థిక బలానికి ఆధారం అని చరిత్ర వివరిస్తోంది.