హార్ముజ్ జలసంధి 30 రోజుల్లో తిరిగి తెరుచుకుంటుంది: ఇరాన్

హార్ముజ్ జలసంధి రాబోయే 30 రోజుల్లో తిరిగి తెరుచుకుంటుందని, యుద్ధానికి ముందున్న స్థితికి వస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఇరాక్ విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్‌లో ఏర్పాటు చేసిన అడ్డంకుల్ని ఇరాన్ తొలగిస్తుందని, ఇది పూర్తిగా ఇరాన్ వ్యవస్థ కిందే పనిచేస్తుందని స్పష్టం చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులను ఆపడం అమెరికా బాధ్యత అని అరాఘ్చి అన్నారు.

సంబంధిత పోస్ట్