ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక చిన్నారికి అంతుచిక్కని వ్యాధి సోకడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పెనుగంచిప్రోలులో ఒంటి నిండా బొబ్బలతో బాధపడుతున్న చిన్నారికి వైరస్ వ్యాధి సోకిందని ప్రచారం జరిగింది. వెంటనే స్పందించిన జిల్లా అధికారులు చిన్నారికి చికిత్స అందించడంతో తగ్గినట్లు వైద్యులు తెలిపారు. అపోహలను నమ్మవద్దని సూచిస్తూ అధికారులు గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా గార్లలో జరిగిన ఫంక్షన్‌కి వెళ్లివచ్చాక ఇలా అయ్యిందని ఆమె బంధువులు పేర్కొంటున్నారు.