శ్రీవారి ఆలయం ముందు రీల్స్‌ చేస్తే కఠిన చర్యలు: TTD

తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని TTD హెచ్చరించింది. ఈ మధ్య ఆలయం ముందు, మాడ వీధుల్లో కొంతమంది వెకిలి చేష్టలు, డ్యాన్స్‌లతో రీల్స్‌ చేస్తుండటంపై TTD ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించింది. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్