తెలంగాణలో నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో CM సమీక్ష చేపట్టారు. వానకాలం పంటలకు సన్నద్ధమవ్వాలని, రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఎరువుల కొరత లేకుండా చూడాలని, ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని CSకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు.