పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని, ముఖ్యంగా తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, తప్పుడు సమాచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంధన భద్రత, సరఫరా గొలుసు వ్యవస్థలు సజావుగా కొనసాగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు కేంద్రంతో సమన్వయం చేసుకొని పనిచేస్తామని సీఎంలు హామీ ఇచ్చారు.