తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై టీటీడీ స్పందించింది. 'స్వామివారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు నోటిలో గాయమైందని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ ఆరోపించాడు. వెంటనే స్పందించి స్విమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా.. నాలుకను కొరుక్కోవడంతో గాయమైందని తేలింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తుండటం గుర్తించాం. అతడిపై చర్యలు తీసుకుంటాం' అని ప్రకటనలో పేర్కొంది.