ఔషధాల నాణ్యతకు కఠిన చట్టం: కేంద్రం ముందడుగు

ఔషధ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు, నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఔషధాలు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల చట్టం 2025' పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫిర్యాదులు, మధ్యప్రదేశ్‌లో కలుషిత దగ్గు సిరప్‌తో పిల్లల మరణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నకిలీ, నాసిరకం ఔషధాలపై తక్షణ చర్యలు, లైసెన్సింగ్ ప్రక్రియ డిజిటలైజేషన్, పరీక్షా ప్రయోగశాలల సామర్థ్యాల పెంపు వంటి నిబంధనలు ఇందులో ఉంటాయి.

సంబంధిత పోస్ట్