వేసవి సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 44 సమ్మర్ స్పెషల్ రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అదనపు సర్వీసులు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 17 వరకు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి టెర్మినల్ మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. తిరుపతి మార్గంలో, అలాగే అకోలా, చర్లపల్లి, నాందేడ్, నరసాపూర్, పండరీపూర్, మైసూర్, భువనేశ్వర్, బెలగావి, జాల్నా, కాకినాడ, లింగంపల్లి, అనకాపల్లి, ధర్మవరం వంటి ప్రాంతాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.