అంటార్కిటికా మంచు పొరల కింద ఒకప్పుడు హిమాలయాలంత ఎత్తైన ప్రాచీన పర్వతాలు ఉండేవని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఏఎన్యూ, జర్మనీకి చెందిన జీఎఫ్జెడ్ పరిశోధకులు సముద్ర గర్భంలోని 1,712 జిర్కాన్ ఖనిజ రేణువులను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. 650-450 మిలియన్ ఏళ్ల క్రితం ఉన్న ఈ పర్వతాలు క్షీణించడంతో ఇనుము, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సముద్రాల్లోకి చేరాయని తెలిపారు. దీంతో ఆక్సిజన్ పెరిగి, సుమారు 539 మిలియన్ ఏళ్ల క్రితం జరిగిన కేంబ్రియన్ విస్ఫోటనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పరిశోధకులు పేర్కొన్నారు.