రాష్ట్రపతికి సుప్రీం కోర్టు గడువు.. స్పందించిన ఉప రాష్ట్రపతి

శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదా తిరస్కరించడం వంటి అంశాల్లో గవర్నర్‌లతో పాటు రాష్ట్రపతికి సైతం ఇటీవల సుప్రీం కోర్టు గడువు విధించింది. ఈ తీర్పుపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ స్పందించారు. న్యాయస్థానాలు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి కలగకూడదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, దేశంలోని శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సమతౌల్యం నిలుపుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్