బీహార్ ఓటరు జాబితా సవరణలో ఈసీ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

బీహార్ ఓటరు జాబితా సవరణలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని తేల్చి చెప్పింది. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందని మండిపడింది. బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆధార్ పౌరసత్వ గుర్తింపు కార్డు కాదని న్యాయస్థానానికి ఎన్నికల సంఘం వాదనలు వినిపించింది.

సంబంధిత పోస్ట్