మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మల్టీప్లెక్స్‌లలోని అధిక ధరలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటర్ బాటిల్‌కు రూ.100, పాప్‌కార్న్‌కు రూ.500 వసూలు చేయడంపై మండిపడింది. ధరలు తగ్గించకపోతే థియేటర్లు ఖాళీ అవుతాయని హెచ్చరించింది. కర్ణాటక ప్రభుత్వం టికెట్ ధరలను రూ.200కు పరిమితం చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో సవాలు చేయగా ఈ వ్యాఖ్యలు చేసింది. టికెట్ల ధరలపై రూ.200 పరిమితిపై మధ్యంతర స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది.

సంబంధిత పోస్ట్