అప్పర్‌భద్ర నిర్మాణంపై సుప్రీంకోర్టు విచారణాంశాలు ఖరారు

కృష్ణా ట్రైబ్యునల్ అవార్డు పరిధిలోకి రాని అప్పర్‌భద్ర ప్రాజెక్ట్ నిర్మాణంపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టాల్సిన అంశాలను ఖరారు చేసింది. ఈ అంశాలపై విచారణ జరపాలని ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు ఏడు అంశాలను ప్రతిపాదించాయి. గతంలో సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఈ ముసాయిదా అంశాలను సమర్పించాయి. అయితే, తెలంగాణ రాష్ట్రం చేసిన ప్రతిపాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. అవసరమైతే మరో సూట్ దాఖలు చేసుకోవాలని తెలంగాణకు సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕