ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో NCERT ‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ (పార్ట్-2)’ పాఠ్యపుస్తకాన్ని ఉపసంహరించుకుంది. ‘మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అధ్యాయంలోని వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టు ఫిబ్రవరి 26 సంపూర్ణ నిషేధం విధించింది. పుస్తక ప్రతులు, పీడీఎఫ్ కాపీలు వెంటనే తిరిగి ఇవ్వాలని, డిజిటల్ కంటెంట్ తొలగించాలని NCERTని ఆదేశించింది. సవరణలతో 2026-27లో కొత్త ఎడిషన్‌ను విడుదల చేయనున్నట్లు NCERT తెలిపింది.