ఢిల్లీలో పర్యావరణహితమైన బాణసంచా (గ్రీన్ క్రాకర్స్) విక్రయాలు, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. దీపావళి పండుగ సందర్భంగా పిల్లలు ఆనందంగా గడపడానికి గ్రీన్ క్రాకర్స్‌తో సంబరాలు చేసుకునేందుకు అనుమతించాలని పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఈ మేరకు బుధవారం అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.