తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను నిరాకరించిన సుప్రీంకోర్టు

పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంతో పాటు, ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ కోరింది. అయితే, ప్రధాన పిటిషన్‌లో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దేవరకు పూర్తి విచారణ చేపట్టడం కుదరదని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌పై విచారణ జరపకుండా నోటీసులు ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది.

సంబంధిత పోస్ట్