కావేరి జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలకతీర్పు

కావేరి జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కర్ణాటకకు 70 టీఎంసీల అదనపు నీటి కేటాయింపు కోరుతూ దాఖలైన రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు సొసైటీలు దాఖలు చేసిన పిటిషన్లు చెల్లవని, అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో థర్డ్ పార్టీలు జోక్యం చేసుకోలేవని కోర్టు స్పష్టం చేసింది. సొసైటీల పిటిషన్లను విచారిస్తే వివాదాలు ఎప్పటికీ ముగియవని వ్యాఖ్యానించింది. కావేరి జలాలపై తమిళనాడు, కర్ణాటక చట్టపరంగా పోరాడుతున్నందున, ఈ విషయంలో ఆ రెండు రాష్ట్రాలకే మాట్లాడే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕