కంచ గచ్చిబౌలి భూములపై విచారణ.. మే 15కు వాయిదా

కంచ గచ్చిబౌలి భూములలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతను సమర్థించవద్దని, పునరుద్ధరణ ప్రణాళిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. పర్యావరణ పరిరక్షణలో రాజీపడేది లేదని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా చెట్లు నరికితే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్