ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందని.. దేశవ్యాప్తంగా పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించేలా నిర్వహించేలా సుప్రీంకోర్టులో కేఏ పాల్ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. "మీరు గెలిస్తే ట్యాంపరింగ్ చేయలేదంటారు.. ఓడితే ట్యాంపరింగ్ జరిగిందంటారు. బ్యాలెట్ విధానంతో అవినీతి ఆగిపోతుందని చెప్పగలరా?" అని ప్రశ్నించింది. అనంతరం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.