పుర్లకుంట వద్ద స్వచ్ఛత కార్యక్రమాలు

మఠంపల్లి మండలం పుర్లకుంట వద్ద మఠంపల్లి నుంచి చౌటపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై పేరుకుపోయిన అశుభ్రతను మఠంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ శుభ్రతా కార్యక్రమంలో సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య, వార్డ్ సభ్యులు కటికల ప్రభుదాస్, తుమ్మ దిలీప్ రెడ్డి, కాటుపల్లి నాగరాజు, మామిడి పద్మ, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ చర్యతో రహదారి పరిశుభ్రంగా మారింది.

సంబంధిత పోస్ట్