హుజూర్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా సతీష్ కుమార్

హుజూర్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా సతీష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత కమిషనర్ శ్రీనివాస్ బదిలీపై వెళ్లడంతో ఏర్పడిన ఖాళీలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు నూతన కమిషనర్‌ను అభినందించారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్