అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదు... ఎస్ఐ గోపాల్ రెడ్డి

కోదాడ మండల పరిధిలోని అడ్లూరు గ్రామంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం గ్రామంలో సిబ్బందితో గస్తీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదని, సామాజిక మాధ్యమాల్లో పుకార్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు శాంతియుత వాతావరణం కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్