తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో టీచర్లు, అధ్యాపకుల జీతాలు మార్కెట్‌తో పోలిస్తే అధికంగా ఉన్నాయని, భవిష్యత్తులో సమీక్షించాలని సిఫార్సు చేయడాన్ని టిపిటిఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బడుగుల సైదులు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు ఉపాధ్యాయుల మనోభావాలను, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అన్నారు. జీతాలు అధికమని చెప్పడానికి కమిషన్ ఏ ప్రాతిపదికను అనుసరించిందో, ఎవరితో పోల్చిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.