బదిలీపై వెళ్తున్న పశువైద్య సిబ్బంది కి వీడ్కోలు

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో బుధవారం, పశువైద్య సహాయకుడు మాదా రాజు, ఆఫీస్ సబార్డినేట్ పేరం ప్రశాంత్‌లకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. సహాయ సంచాలకులు డా. పి. పెంటయ్య వారిని సన్మానించి, రెండు సంవత్సరాల పాటు అందించిన సేవలను కొనియాడారు. నూతన ప్రాంతాల్లోనూ అంకితభావంతో పనిచేసి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది చంద్రకళ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్