గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు: కలెక్టర్ పర్యవేక్షణ, అధికారులకు సూచనలు

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మంగళవారం అనంతగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను జాగ్రత్తగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వారితో మాట్లాడి, కేంద్రంలో అవసరమైన వసతులు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకున్నారు. అధికారులు ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసిల్దార్ హిమబిందు, ఎంపీడీవో హరి సింగ్, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్