కోదాడ: మూడు నెలలకు సరిపడే బియ్యం ఒకే సారి పంపిణీ చేయాలి

నడిగూడెం మండలం రత్నవరంలో రేషన్ దుకాణాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ రాంబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ప్రజలు ఇబ్బందిపడకుండా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సన్నబియ్యం మూడు నెలలకి సరిపడేవి ఒక్కేసారి పంపిణి చేయాలని రేషన్ డీలర్ ను ఆదేశించారు. సన్న బియ్యం నాణ్యత బాగున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రాలు సెలవులు అనంతరం తెరుస్తున్నందున పరిసరాలు శుభ్రం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్