నడిగూడెం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వరద తాకిడికి గురైన ప్రాంతాన్ని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, స్థానిక ఎమ్మార్వోతో కలిసి పరిశీలించారు. వరద నీరు వెళ్లేందుకు చెరువు రెండు తూములను తెరవాలని ఆదేశించారు. ఇళ్లు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని చైర్ పర్సన్ కోరారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.