కోదాడ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నపరెడ్డి అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓరుగంటి వెంకట బ్రహ్మం అధ్యక్షుడిగా, కొత్త బ్రహ్మయ్య ప్రధాన కార్యదర్శిగా, నరేంద్రుని నాగేశ్వరరావు కోశాధికారిగా, పశ్యా నవీన్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా, మట్టా కృష్ణారెడ్డి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జి సత్యనారాయణ, కే నర్సిరెడ్డి గౌరవ సలహాదారులుగా నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడు బ్రహ్మం తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.