పట్టణ పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలి

కోదాడ పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో ప్రజలు సహకరించి, జిల్లాలో అగ్రస్థానంలో నిలపాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు కోరారు. 31వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో, మున్సిపల్ కమిషనర్ రమాదేవితో కలిసి మాట్లాడుతూ, చెత్తను వీధుల్లో వేయకుండా సిబ్బందికి అప్పగించాలని, తడి-పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం సాధ్యమని, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కమిషనర్ రమాదేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్