కోదాడ పెద్ద చెరువు మత్స్య సొసైటీ ఎన్నికల పోలింగ్ సందడి మొదలైంది. తొమ్మిది మంది డైరెక్టర్లు ఉన్న ఈ సొసైటీకి ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 8 డైరెక్టర్లను నేడు ఎన్నుకోనున్నారు. గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ జరగనుంది, సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల కేంద్రం ఏర్పాటు చేయడంతో పాఠశాల వద్ద సందడి నెలకొంది.