కోదాడ మండలం తొగర్రాయి సబ్ స్టేషన్ లో అత్యవసర పనుల నిమిత్తం రేపు గురువారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ రూరల్ ఏఈ సైదా తెలిపారు. ఈ కారణంగా తొగర్రాయి, గణపవరం, కూచిపూడి, కాపుగల్లు, గుడిబండ, అడ్లూరు గ్రామాల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.