వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

కోదాడ పట్టణంలోని 26వ వార్డులో మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ. 2 లక్షల వ్యయంతో చేపట్టనున్న కల్వర్టు నిర్మాణం, మిషన్ భగీరథ గుంతల పూడ్చివేత పనులకు శనివారం కౌన్సిలర్ నేహా నాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు నేహా నాజ్ తెలిపారు. కల్వర్టు నిర్మాణంతో స్థానికులకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని, పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయిస్తామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షమీ, కాజా భాయ్, నాసిర్, గురునాథం, సుజావుద్దీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్