కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ తీరు, బందోబస్తు ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అభ్యర్థులు, అనుచరుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ తనిఖీలో సీఐ శివశంకర్, కమిషనర్ రమా దేవి కూడా పాల్గొన్నారు.