కోదాడ తహసీల్దార్ గా సంతోష్ కిరణ్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కలెక్టరేట్ లో పనిచేస్తున్న సాయి సంతోష్ ను కోదాడ ఎమ్మార్వోగా బదిలీ చేశారు. కోదాడలో పనిచేస్తున్న తహసీల్దార్ వాజిద్ అలీని సూర్యాపేట కలెక్టరేట్ కు బదిలీ చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. సంతోష్ కిరణ్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.