కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్, నయానగర్ ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. స్థానికులు, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం నడకకు వెళ్లేవారు, పిల్లలు కుక్కల దాడులకు భయపడుతున్నారు. కర్రలు పట్టుకుని వాకింగ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వీధి కుక్కలను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.