కోదాడ మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) సమగ్ర సర్వేలో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లిన అధికారులు, ప్రజలకు ఓటరు వివరాలను సరిచూసుకోవడం, అవసరమైన పత్రాలను సమర్పించడం, నమోదు ప్రక్రియలో సహకరించాలని సూచించారు. బీఎల్ఓ నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏ చలిగంటి రజని, నాయకులు చలిగంటి వెంకట్, మాజీ కౌన్సిలర్ రాజుతో పాటు స్థానికులు పాల్గొన్నారు. ఓటరు జాబితా ఖచ్చితత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.