శభాష్ కోదాడ ట్రాఫిక్ పోలీస్.. ఆపరేషన్ రోడతో గుంతలుపూడ్చి వేత

కోదాడ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. గుంతల వల్ల ప్రమాదకరంగా మారిన రోడ్లను మరమ్మతులు చేసి పూడ్చారు. ఆపరేషన్ రోడ్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత శాఖలతో కలిసి చర్యలు కొనసాగిస్తున్నామని ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు. రోడ్లపై ఆక్రమణలు తొలగించి, ప్రమాద ప్రాంతాలను గుర్తించి సరిదిద్దినట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్