కోదాడ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి ముత్యాలు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కార్మికులు నినాదాలు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్‌తో పాటు మున్సిపల్ చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు కొమ్ము నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.