నాణ్యమైన సేవలతో వ్యాపార అభివృద్ధి... ఎమ్మెల్యే పద్మావతి

సూర్యాపేట పట్టణంలోని రామలింగేశ్వర థియేటర్ రోడ్డులో సౌత్ ఇండియా ఏషియన్ పెయింట్స్ ఐడియా స్టోర్‌ను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గృహాల అందాన్ని పెంచే నాణ్యమైన పెయింట్స్ అందుబాటులోకి రావడం సంతోషకరమని, వినియోగదారులకు ఆధునిక డిజైన్‌లు, ఉత్తమ సేవలు అందించాలని తెలిపారు. స్థానిక వ్యాపారాల అభివృద్ధికి ఇలాంటి సంస్థలు తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్