రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలన్న ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సన్నబియ్యం పంపిణీ క్రెడిట్ సీఎం రేవంత్‌కే దక్కుతుందన్నారు. సన్నబియ్యం కోసం ఏటా రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.40 వేల కోట్లు జమ చేశామని తెలిపారు.