సూర్యాపేటలో “ఏక్ పెడ్ మా కే నామ్ – సోయింగ్ టు గ్రోయింగ్ 2026”

సూర్యాపేటలో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో “ఏక్ పెడ్ మా కే నామ్ – సోయింగ్ టు గ్రోయింగ్ 2026” కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి, ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. పండ్లతో పాటు ఇతర మొక్కలను పాఠశాలల్లో నాటేందుకు చర్యలు చేపట్టాలని, మొక్కల నాటడం, సీడ్ బాల్స్ తయారీ, పర్యావరణ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ఫోటోలు అప్‌లోడ్ చేయడం ద్వారా పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్