ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి

మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్ లో మున్సిపల్ కమీషనర్లు, ఆర్డీవోలు, తాసిల్దార్లతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. ఎన్నికల సిబ్బంది ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ మున్సిపాలిటీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్