సూర్యాపేట పట్టణంలోని 13వ వార్డు భాషానాయక్ తండాలోని ఈద్గా వద్ద బక్రీద్ పండుగ ఏర్పాట్లను బుధవారం ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, డీఎస్పీ ప్రసన్నకుమార్ పరిశీలించారు. పండుగ సందర్భంగా ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ షఫీయుల్లా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అంజద్ అలీ తదితరులు పాల్గొన్నారు.