ప్రజల ధన, ప్రాణ రక్షణ కోసం రాత్రి గస్తీని ముమ్మరం.. ఎస్పీ

సూర్యాపేట జిల్లా పోలీసులు, ఎస్పీ నరసింహ ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రజల ధన, ప్రాణ రక్షణకు రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ఈ-బీట్ విధానం ద్వారా పెట్రోలింగ్ సిబ్బంది కదలికలను డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షిస్తున్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి ప్రాంతాలను సెక్టార్లుగా విభజించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బ్యాంకులు, ఏటీఎంలు, హోటళ్లు, లాడ్జీలు, జాతీయ రహదారుల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిపై ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్