సూర్యాపేట కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే.సీతారామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.