సూర్యాపేట జిల్లాలో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం హెచ్చరించారు. రైతులు, కూలీలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండొద్దని, శిథిలావస్థ ఇళ్లలో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.